Lulu Chairman” మానవత్వ చాటుకున్న యూసుఫ్ అలీ
కొంత మంది బిలియనీర్లు తమ గొప్ప మనసును చాటుకుంటారు. కష్టాల్లో ఉన్నవారికి వెన్నుదన్నుగా నిలుస్తుంటారు. ఇదే కోవాలో లూలు చైర్మెన్ యూసుఫ్ అలీ కష్టాల్లో ఆడబిడ్డకు ఆపన్న హస్తం అందించారు. భర్త వదిలేసి వెళ్లిన ఓ మహిళ ఇద్దరు తన పిల్లలతో దిక్కులేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమెకు సాయం అందించారు. కేరళలోని నార్ద్పరవుర్ కు చెందిన సంధ్య అనే మహిళ ఆమె భర్త ఇంటి కట్టుకునేందుకు 2019లో రూ. 4 లక్షలను ఓ ప్రయివేట్ కంపెనీలో లోన్ తీసుకున్నారు. కొన్ని రోజులకు సంధ్య భర్త పిల్లలను, ఇంటి వదలివెళ్లాడు. దీంతో అప్పు భారం అంతా సంధ్య మీద పడింది. లోన్ వడ్డీ పెరిగి రూ. 8 లక్షలు అయ్యింది. దీంతో కంపెనీ వారు నాలుగు సార్లు లోన్ కట్టాలని వార్నింగ్ ఇచ్చారు. బతుకుదెరువు కోసం సంధ్య ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నది. ఈ క్రమంలో ఆ ప్రయివేట్ కంపెనీ చట్ట పరంగా ఇంటిని స్వాధీనం చేసుకుంది. ఇంట్లో ఉన్న సామాను తీసుకుంటామని బతిమాలినా అందుకువారు తిరస్కరించారు. సంధ్య కట్టుబట్టలతో రోడ్డుమీదపడింది. ఈ వ్యవహరమంతా అక్కడి మీడియాలో ప్రసారం అయ్యింది. ఈ క్రమంలో విషయం లూలు చైర్మెన్ యూసుఫ్ అలీ దృష్టికి చేరింది. ఆయన తన సిబ్బందిని పంపి సంధ్యకు ఉన్న అప్పు తీర్చేసి అదనంగా మరో రూ. 10లక్షలు ఆర్ధిక సహాయం అందించారు. సంధ్య మాట్లాడుతూ యూసుఫ్ అలీ కి కృతజ్ఞతలు తెలిపారు. నెటిజన్లు కూడా ఆయనపై ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు.
Lulu Group chairman M A Yusuff Ali came to the aid of Sandhya, a Kerala woman evicted over an unpaid Rs 8 lakh loan, by settling the debt and giving her Rs 10 lakh for a fixed deposit.#kerala #Lulu pic.twitter.com/9GPwMOfxCJ
— Indian Trend (@IndianTrendX) October 15, 2024
ఇవి కూడా చదవండి
Bengaluru News” గుడిలో శ్లోకాలు చదువుతుంటే.. మహిళ మెడలో గొలుసు కొట్టేసిన దొంగ.. వీడియో
Artificial Plants” ఆర్టీఫిషియల్ 8 మొక్కలు కేవలం 269కే.. మీ ఇంటిని అందంగా అలకరించుకోండి..
Jaipur” మంటలలో కాలుతూ దూసుకెళ్లిన కారు.. వీడియో
Warangal” డెకరేషన్ లైట్లకు తగిలి వ్యక్తి మృతి.. చేతిలో మనవడు… వీడియో
Ratan Tata” రతన్ టాటా ప్రస్తానం ఇదే.. 100 బిలియన్ల వ్యాపార సామ్రాజ్యం..
Cooch Behar, West Bengal” బొలెరోను ఢీకొట్టి పేలిపోయిన బైక్.. ముగ్గురు మృతి సీసీ వీడియో