New Ration cards” 2025పదేళ్ల నిరీక్షణకు తెర: కరీంనగర్ జిల్లాలో కొత్తగా 78,179 రేషన్ కార్డులు.. ఏ మండ‌లంలో ఎన్నంటే..?

New Ration cards”

మానకొండూర్, కరీంనగర్ జిల్లా:
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీకి పదేళ్ల తర్వాత నూతన దశ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ…. జిల్లాలో మొత్తం 78,179 తెల్ల రేషన్ కార్డులు మంజూరయ్యాయన్నారు. పాత కార్డు దారులతోపాటు, కొత్తగా అర్హత పొందిన పేద కుటుంబాలకు కూడా నాణ్యమైన సన్నబియ్యం అందించబడుతుందని ఆయన తెలిపారు.

మండలాల వారీగా రేషన్ కార్డుల వివరాలు:

మండలం పేరు కార్డుల సంఖ్య
మానకొండూర్ 5,113
తిమ్మాపూర్ 3,366
శంకరపట్నం 3,256
గన్నేరువరం 1,520
కరీంనగర్ కార్పొరేషన్ 18,484
కరీంనగర్ మండలం 4,381
కొత్తపల్లి 5,079
రామడుగు 4,315
సైదాపూర్ 3,098
హుజూరాబాద్ 6,031
జమ్మికుంట 5,060
ఇల్లందకుంట 2,374
వీణవంక 3,929
చొప్పదండి 3,842
చిగురుమామిడి 3,172
గంగాధర 5,159

మొత్తం రెండు దశల్లో – ఒకటవ దశలో 38,282 మంది, రెండో దశలో 47,120 మంది లబ్ధిదారులకు కార్డులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రజలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి విజ్ఞప్తి:

రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని, ఇంకా పొందనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాణ్యమైన సన్న బియ్యం అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు.

పవర్ బ్యాంక్‌లో పవర్‌హౌస్!
boAt Energyshroom PB401 – 20000mAh
⚡ 22.5W ఫాస్ట్ చార్జింగ్
2-Way Input (Type-C & Micro USB)
3X Output పోర్ట్స్ – ఒకే సారి మల్టీ డివైస్ చార్జింగ్
Smartphones, Tablets, Earbuds, Smartwatch – అన్నింటికీ సరిపోతుంది!
స్టైలిష్ Midnight Blue డిజైన్

ట్రావెల్, వర్క్, డేలీ యూజ్ – అన్నిటికీ బెస్ట్ బ్యాటరీ బ్యాడీ!

ఫుల్ ఛార్జ్ – ఫుల్ ఎనర్జీ – ఎప్పుడు రెడీ!
కొనుగోలు కోసం లింక్ పై క్లిక్ చేయండి..  https://amzn.to/40TuEjM

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *