nitya annadata” నిత్య అన్నదాతకు ఘ‌న స‌న్మానం

nitya annadata” అన్నదాత సుఖీభవ’ 

శంకరపట్నం (డిసి ప్రతినిధి):

హనుమాన్ మాలాదరణ భక్తులు సోమవారం నాడు నిత్య అన్నదాత అయిన గుర్రం వాణి వెంకటేశం దంపతులకు ఘన సన్మానం నిర్వహించారు.
అన్నదాత సుఖీభవఅంటూ ఆయన సేవలను గుర్తించి, గౌరవించారు.

సందర్భంగా భక్తులు మాట్లాడుతూ —
ప్రతి ఏటా హనుమాన్ మాలాదరణ సమయంలో భక్తులందరికీ అక్షయంగా అన్నదానం నిర్వహిస్తున్న వెంకటేశం గారి సేవలు అభినందనీయం,” అని పేర్కొన్నారు.

కేశవపట్నం గ్రామానికి చెందిన ‘ఆల్ఫ్రెడ్ మొబైల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్’ కరస్పాండెంట్ అయిన వాణి శ్రీనివాస్ హనుమాన్ భక్తుడిగా నిలిచిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

కార్యక్రమంలో హనుమాన్ మాలాదరణ భక్తులు, గ్రామస్తులు, శ్రద్ధాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *