Surveyors Training” మే 26న నిజ నిరూపణ పత్రాల తనిఖీ – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, మదర్ న్యూస్ ప్రతినిధి:
పెద్దపల్లి జిల్లాలో మొదటి విడతగా 125 మంది ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లకు జేఎన్టీయూ మంథని ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
భూ భారతి చట్టం అమలులో భాగంగా ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 224 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, అందులో మొదటి విడతలో 125 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనుండగా, ఈ శిక్షణకు జేఎన్టీయూ మంథని ఇంజనీరింగ్ కళాశాలను కేంద్రంగా ఎంపిక చేసినట్లు వివరించారు.
అభ్యర్థులు మే 26 సోమవారం ఉదయం 10 గంటలకు జేఎన్టీయూ మంథని ఇంజనీరింగ్ కళాశాలకు హాజరై, తమ నిజ నిరూపణ పత్రాలను తనిఖీ చేయించుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు.
