Thursday , 12 September 2024
Breaking News

నేటినుంచి ప్రో క‌బ‌డ్డీ సీజ‌న్ 10.. ఎవ‌రెవ‌రికీ మ్యాచ్‌లంటే

కబడ్డీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్‌ సీజన్‌ 10 డిసెంబరు 2న ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని ట్రాన్స్‌స్టేడియాలోని ఏకా అరేనా గ్రౌండ్‌ వేదికగా తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌ మ్యాచ్‌ లు 2024 ఫిబ్రవరి 21 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. ప్లే ఆఫ్‌లకు సంబంధించి షెడ్యూల్‌ త్వరలోనే తెలపనున్నారు. మరోవైపు పో కబడ్డీ సీజన్‌ 10 కోసం తెలుగు టైటాన్స్‌ కొత్త జట్టును ప్రకటించింది. ప్లేఆఫ్‌ రౌండ్‌లోకి ప్రవేశించిన టాప్‌ సిక్స్‌తో ఇతర 11 జట్ల మాదిరిగానే తెలుగు టైటాన్స్‌ 22 లీగ్‌ దశ మ్యాచ్‌లు ఆడుతుంది. తెలుగు టైటాన్స్‌ సీజన్‌ 10కి పవన్‌ కుమార్‌ షెరావత్‌ను కెప్టెన్‌గా, పర్వేష్‌ భైన్‌స్వాల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా.. తెలుగు టైటాన్స్‌ టీమ్‌ యజమాని గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ”ఇండియా ఇంటర్నేషనల్‌ పవన్‌ కుమార్‌ షెరావత్‌ను ఈ ఏడాది వేలంలో రికార్డు స్థాయిలో రూ. 2.605 కోట్లకు తెలుగు టైటాన్స్‌ సొంతం చేసుకుంది. లీగ్‌ చరిత్రలో అత్యధికంగా చెల్లించిన ఆటగాడిగా నిలిచాడు. కబడ్డీ క్రీడను కొనసాగించే వారందరికీ జీవితంలో, వత్తిలో గౌరవ భావాన్ని తెలుగు టైటాన్స్‌ తీసుకువచ్చింది. లీగ్ 2014లో ప్రారంభమైనప్పటి నుండి ఆకాశమే హద్దుగా ఈ క్రీడ విస్తరించింది. అశేషమైన అభిమానులకు ఇష్టమైన క్రీడగానూ మారింది ” అని అన్నారు. తెలుగు టైటాన్స్‌ సీఈఓ త్రినాధ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ”ప్రపంచంలోని అత్యుత్తమ కబడ్డీ అథ్లెట్లు తెలుగు టైటాన్స్‌లో ఆడేలా చూసుకున్నాము. నేడు, దేశంలోని అన్ని ప్రాంతాల్లో కబడ్డీ ఆడే యువత చాలా ఎక్కువ. అత్యధిక ధర పలికిన వ్యక్తిగా పవన్‌ తన రికార్డును తిరిగి పొందడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఆర్థికంగా లాభదాయకమైన మోడల్‌ను అభివృద్ధి చేసింది. ఇది క్రీడతో సంబంధం ఉన్న అథ్లెట్ల కలలకు రెక్కలు ఇచ్చింది ” అని అన్నారు. ఇదిలా ఉంటే.. ప్రో కబడ్డీ లీగ్‌ 2023-24 సీజన్‌ భారతదేశంలోని స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అదే సమయంలో, స్టార్‌ నెట్‌వర్క్‌లో వివిధ ప్రాంతీయ భాషల్లో గేమ్‌లను కూడా ఆస్వాదించవచ్చు. లీగ్‌ మ్యాచ్‌లను డిస్నీం హాట్‌స్టార్‌లో కూడా ఉచితంగా వీక్షించవచ్చు.

ప్రో కబడ్డీ సీజన్‌ 10 (తెలుగు టైటాన్స్‌) మ్యాచ్‌ షెడ్యూల్‌:
2 డిసెంబర్‌ 2023 శనివారం రాత్రి 8 గంటలకు
తెలుగు టైటాన్స్ * గుజరాత్‌ జెయింట్స్‌
6 డిసెంబర్‌ 2023 బుధవారం రాత్రి 8 గంటలకు
తెలుగు టైటాన్స్ * పాట్నా పైరేట్స్‌
9 డిసెంబర్‌ 2023 శనివారం రాత్రి 9 గంటలకు
తెలుగు టైటాన్స్ * యోధా
13 డిసెంబర్‌ 2023 బుధవారం రాత్రి 8 గంటలకు
తెలుగు టైటాన్స్ * తమిళ్‌ తలైవాస్‌
16 డిసెంబర్‌ 2023 శనివారం రాత్రి 9 గంటలకు
తెలుగు టైటాన్స్ * దబాంగ్‌ ఢిల్లీ %ఖ.జ.
%22 డిసెంబర్‌ 2023 శుక్రవారం రాత్రి 9 గంటలకు
తెలుగు టైటాన్స్ * హర్యానా స్టీలర్స్‌
24 డిసెంబర్‌ 2023 ఆదివారం రాత్రి 9 గంటలకు
తెలుగు టైటాన్స్ * బెంగళూరు బుల్స్‌
30 డిసెంబర్‌ 2023 శనివారం రాత్రి 8 గంటలకు
తెలుగు టైటాన్స్ * యు ముంబా
1 జనవరి 2023 సోమవారం రాత్రి 8 గంటలకు
తెలుగు టైటాన్స్ * పుణెరి పల్టన్‌
6 జనవరి 2023 శనివారం రాత్రి 9 గంటలకు
తెలుగు టైటాన్స్ * జైపూర్‌ గుజరాత్‌ గెయింట్స్‌
9 జనవరి 2023 మంగళవారం రాత్రి 8 గంటల నుండి తెలుగు టైటాన్స్‌ %ఙర% బెంగాల్‌ వారియర్స్‌
12 జనవరి 2023 శుక్రవారం రాత్రి 8 గంటలకు
తెలుగు టైటాన్స్ * జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌
19 జనవరి 2023 శుక్రవారం రాత్రి 9 గంటలకు
తెలుగు టైటాన్స్ * బెంగళూరు బుల్స్‌
20 జనవరి 2023 శనివారం రాత్రి 9 గంటలకు
తెలుగు టైటాన్స్ * యోధా
22 జనవరి 2023 సోమవారం రాత్రి 9 గంటలకు
తెలుగు టైటాన్స్ * హర్యానా స్టీలర్స్‌
24 జనవరి 2023 బుధవారం రాత్రి 9 గంటలకు
తెలుగు టైటాన్స్ * తమిళ్‌ తలైవాస్‌
30 జనవరి 2023 మంగళవారం రాత్రి 8 గంటలకు
తెలుగు టైటాన్స్ * పుణెరి పల్టన్‌
3 ఫిబ్రవరి 2023 శనివారం రాత్రి 9 గంటల నుండి తెలుగు టైటాన్స్ * దబాంగ్‌ ఢిల్లీ 10 ఫిబ్రవరి 2023 శనివారం రాత్రి 9 గంటలకు
తెలుగు టైటాన్స్ * బెంగాల్‌ వారియర్స్‌
13 ఫిబ్రవరి 2023 మంగళవారం రాత్రి 8 గంటల నుండి తెలుగు టైటాన్స్ పాట్నా పైరేట్స్‌
16 ఫిబ్రవరి 2023 శుక్రవారం రాత్రి 9 గంటలకు
తెలుగు టైటాన్స్‌* జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌
20 ఫిబ్రవరి 2023 మంగళవారం రాత్రి 8 గంటలకు
తెలుగు టైటాన్స్ * యు ముంబా

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పెయింట్

టీష‌ర్ట్ విప్పి.. మెట్రోలో మంచి ప‌ని.. వీడియో వైర‌ల్

ర‌క్త‌పాత‌మే.. యానిమ‌ల్ రివ్యూ

About Dc Telugu

Check Also

Karnataka News

Karnataka News” స‌ర్వీసింగ్ చేయ‌లేద‌ని షోరూంకు నిప్పు.. వీడియో

Karnataka News” తానుకొనుకున్న బైక్ రెండు రోజుల‌కే స‌మ‌స్య రావ‌డంతో షోరూం తీసుకెళ్లాడు. వారు స‌ర్వీసింగ్ చేయ‌డంలో జాప్యం చేస్తున్నార‌ని …

flood Viral Video

flood Viral Video” ఎందుకు నాయనా అంత తొంద‌రా.. జెర్ర ఉంటే నీ ప్రాణాలు ఏడుంటుండే.. వీడియో వైర‌ల్

flood Viral Video” ఉత్సాహం పెంచుమీరితే ప్రాణం మీదికొస్తది. అంద‌రూ త‌మ‌ను పొగ‌డాల‌నో, త‌మ‌ను ప్ర‌త్యేకంగా చూడాల‌నో కొన్ని పిచ్చి …

Viral Video

Viral Video” అదిరంద‌య్యా.. లేటెస్ట్ గుర్ర‌పు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైర‌ల్‌

Viral Video”   ద్విచ‌క్ర‌వాహ‌నాలు, ఆటోలు, జీపులు రాక‌ముందు మ‌నుషులు ర‌వాణా కోసం గుర్ర‌పు బండ్ల‌ను ఉప‌యోగించారు. సాంకేతిక‌త పెరిగినంకా గుర్ర‌పు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com