Bjp Protest” దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బిజెపి నాయకులు
శంకరపట్నం: డిసి ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల బీహార్ లో ప్రధాని నరేంద్ర మోది మాతృమూర్తి పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ సంస్కారానికి నిదర్శనమని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆయన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
శనివారం, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో, జాతీయ రహదారిపై, ప్రధాని మాతృమూర్తి పట్ల రాహుల్ గాంధీ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు నిరసిస్తూ బిజెపి మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో ధర్న రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రధాని మోదీ తల్లి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిన రాజకీయ స్థాయిని చూపిందన్నారు. రాహుల్ గాంధీ చేసే రాజకీయాలకు ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, నాయకులు దొంగల రాములు, జంగ జైపాల్, దాసరపు నరేందర్, కొయ్యడ అశోక్, రాసమల్ల శ్రీనివాస్, కనకం సాగర్, మందాడి జగ్గారెడ్డి, బిజిలి సారయ్య, నిమ్మశెట్టి సంపత్, వెంగల ప్రవీణ్, గూళ్ళ రాజు, బోడ తిరుపతి, తాడబోయిన రవి, చెరుకు శివ, మెడిశెట్టి రాజేష్, వెంగల మహెందర్, కారంకంటి కుమార్, వెంగల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
