తెలంగాణాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండు మూడు రోజులుగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదలవుతుందంటూ ప్రచారం సాగింది. అయితే ఆదివారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 52 మందితో మొదటి లిస్ట్ ను ప్రకటించగా అందులో 12 మంది మహిళలకు అవకాశం కల్పించారు. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ, ప్రస్తుత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న బండి సంజయ్ మరోసారి కరీంనగర్ బరిలో నిల్చున్నారు. ఇక ఈటల రాజేందర్ హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీలో ఉండనున్నారు. నిజామాబాద్ ఎంపీ కోరుట్ల నుంచి, ఆదిలాబాద్ ఎంపీ బోథ్ నుంచి బరిలో ఉన్నారు. సిరిసిల్ల నుంచి రాణి రుద్రమరెడ్డి, చొప్పదండి నుంచి బొడిగే శోభ, జగిత్యాల నుంచి భోగ శ్రావణి, బెల్లంపల్లి అమురాజుల శ్రీదేవి, జుక్కల్ నుంచి అరుణ తార, నాగార్జున్ సాగర్ నుంచి కంకణాల నివేదిత రెడ్డి, డోర్నకల్ నుంచి బూక్య సంగీత, వరంగల్ ఈస్ట్ రావు పద్మ, భూపాలపల్లి చందుపట్ల కీర్తి రెడ్డి, బాల్కొండ ఏలేటి అన్నపూర్ణమ్మ ,రామగుండం కందుల సంధ్యారాణి, చార్మినార్ మేగా రాణి,
ఆర్టీసీ బస్సులో రూ. 8 లక్షల విలువగల బ్యాగ్ ను మరిచిపోయిన మహిళ.. కండక్టర్ ఏం చేసిదంటే