Ruchi Gujjar Attack”
ముంబయి నగరంలోని ఓ ప్రముఖ థియేటర్ వద్ద ఒక నటి చేసిన అనూహ్య చర్య ఇప్పుడు సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. బాలీవుడ్ నటుడు, నిర్మాతగా పేరు సంపాదించుకున్న మాన్ సింగ్‌పై నటి రుచి గుజ్జర్ ఒక్కసారిగా చెప్పుతో దాడి చేయడం కలకలం రేపుతోంది.
జూలై 25న ముంబయి సిటీ పాలిస్ థియేటర్లో ‘సో లాంగ్ వ్యాలీ’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమం జరుగుతుండగా, రుచి అక్కడికి వచ్చి మాన్ సింగ్ పై బహిరంగంగా దాడిచేశారు. . అనంతరం చెప్పుతో కొట్టి, “తనకు రావలసిన రూ.25 లక్షలు ఇప్పటికీ చెల్లించలేదంటూ” ఆరోపణలు చేశారు. పలుమార్లు సంప్రదించినా స్పందించకపోవడంతో ఇలా బహిరంగంగా విషయాన్ని బయటపెట్టాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.
రుచి చేత పట్టిన ప్లకార్డులు, ఆమె ఆరోపణలు కొంత గందరగోళాన్ని సృష్టించాయి. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె నిర్మాతలపై తీవ్ర విమర్శలు చేస్తూ గాడిదలపై కూర్చునేలా చిత్రీకరించిన ఫ్లెక్సీలను ప్రదర్శించడాన్ని కూడా చూపించారు. గతంలో మ్యూజిక్ ఆల్బమ్‌లకు సంబంధించిన పారితోషిక సమస్యలే ఈ ఘర్షణకు కారణంగా తెలుస్తోంది.
ఈ సంఘటన జరిగిన సమయంలో నిర్మాత కరణ్ మాన్ సింగ్‌కు మద్దతుగా నిలిచారు. థియేటర్ వద్ద ఉన్న సిబ్బంది తక్షణమే రుచిని ఆపి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
రుచి గుజ్జర్ మోడల్‌గాను, నటి గానూ పేరు తెచ్చుకున్నారు. 2023లో మిస్ హర్యానా కిరీటం సాధించిన ఆమె, ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రధాని మోదీ ఫోటో ఉన్న నెక్లెస్‌తో హాజరై అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యారు. ఇప్పుడు ఈ వివాదాస్పద చర్యతో మళ్లీ వార్తల్లో నిలిచారు.
ఈ ఘటనపై నెటిజన్లు, సినీ విమర్శకులు, ప్రేక్షకులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తే, మరికొందరు ఈ చర్యను తప్పుబడుతున్నారు.
actress and model Ruchi Gujjar caused a commotion at the premiere of the film So Long Valley at Cinepolis Theatre, Mumbai, where she publicly assaulted actor-producer Man Singh by hitting him with a chappal (slipper) and slapping him #RuchiGujjar #Ruchi #viralvideo #Chappal… pic.twitter.com/FpsPLWXp7d
— NextMinute News (@nextminutenews7) July 26, 2025

Samsung”సామ్సంగ్ గెలాక్సీ M36 5G: శక్తివంతమైన AI కెమెరా, స్లిమ్ డిజైన్, అద్భుతమైన ప్రదర్శన

️☀️ వర్షం గానీ, ఎండ గానీ… సిద్ధంగా ఉండండి!
TEKCOOL ట్రావెల్ మినీ అంబ్రెల్లాతో మీ రోజును స్టైలిష్‌గా రక్షించుకోండి!
పోర్టబుల్ | లైట్ వెయిట్ | క్యూట్ డిజైన్
పక్కన వేసుకునే బాగ్‌లో సులభంగా పట్టే కాంపాక్ట్ అంబ్రెల్లా!
✨ ఫీచర్స్:
✅ మాన్యువల్ ఓపెన్
✅ 6 స్ట్రాంగ్ రిబ్స్
✅ సన్ అండ్ రెయిన్ ప్రొటెక్షన్
✅ ప్రత్యేకమైన కేస్ తో వస్తుంది
✅ బాలికలు & మహిళలకు బాగా సరిపడేలా డిజైన్
వేసవి లో ఎండనుంచి, వర్షంలో తడవకుండా – ఈ చిన్న అంబ్రెల్లా చాలా పెద్ద మద్దతు!
ఇప్పుడు తీసుకోండి – స్టైలిష్ & సేఫ్‌గా ఉండండి!
అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు https://amzn.to/40EeDhIలింక్ పై క్లిక్ చేయండి
