Shankarapetnam Bjp leaders” బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని సన్మానించిన శంకరపట్నం నాయకులు…

Shankarapetnam Bjp leaders”  శంకరపట్నం :డిసి ప్రతినిధి:
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ను శంకరపట్నం మండల నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానం చేసిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ బూత్ సమ్మేళనానికి తెలంగాణ బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు హాజరు కాగా మొదటిసారి కరీంనగర్ కు అధ్యక్షుడు హోదాలో వచ్చిన రామచంద్రరావు ను కరీంనగర్ జిల్లా, శంకరపట్నం, నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండలాధ్యక్షుడు ఏనుగుల అనిల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమరయ్య, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Redmi Pad Pro” పవర్‌ఫుల్ ఫీచర్లతో .. మీ డిజిటల్ అవసరాలకు అద్భుతమైన పరిష్కారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *