Modelschool”
ఇంచార్జ్ ప్రిన్సిపాల్ నాగమణి
శంకరపట్నం :డిసి ప్రతినిధి:
విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మోడల్ స్కూల్ విద్యార్థులకు బుధవారం ఆర్ బి ఎస్ కే ఆధ్వర్యంలో జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ నాగమణి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో గల మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఆరోగ్యం కోసం జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎదుగుదలను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కే వైద్య బృందం వైద్య అధికారులు అక్షయ్, డాక్టర్ సరిత, ఫార్మసిస్ట్ రమాదేవి, ఏఎన్ఎం సుధా, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయనీలు, విద్యార్థులు, విద్యార్థినీలు, తదితరులు పాల్గొన్నారు.

Best Teacher Award” జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న సంతోష్
