Shyama Prasad Mukherjee” ఘనంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

Shyama Prasad Mukherjee”

శంకరపట్నం మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో కార్యక్రమం

కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీ ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో జరిగాయి.

వేదికపై డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన సేవలకు నాయకులు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆయన దేశానికి అందించిన సేవల పట్ల అభిమానాన్ని వ్యక్తపరిచారు.

అనిల్ మాట్లాడుతూ, మండలంలోని మొలంగూర్, కరీంపేట్, కొత్తగట్టు తదితర గ్రామాలలో బీజేపీ నాయకులు మొక్కలు నాటినట్టు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు.

పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జంగ జైపాల్, దాసారపు నరేందర్, కొయ్యడ అశోక్ యాదవ్, కనకం సాగర్, రాసమల్ల శ్రీనివాస్, బిజిలి సారయ్య, గూళ్ళ రాజు, బొజ్జ సాయి ప్రకాష్, చెరుకు శివ తదితరులు పాల్గొన్నారు.

Rohtang pass” హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

Hari Hara Veera Mallu” కార్డుల దుమ్మురేపిన హరిహర వీరమల్లు ట్రైలర్! – 24 గంటల్లో 48 మిలియన్ వ్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *