Sitarama kalyanam” శంకరపట్నం (డిసి ప్రతినిధి):
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం పరిధిలోని కన్నాపూర్, ధర్మారం గ్రామాల మధ్య ఉన్న వాలి సుగ్రీవ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది.
వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ, శాస్త్రోక్తంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి ఆశేష భక్తజనం తరలివచ్చారు. కన్నాపూర్, ధర్మారం, గద్దపాక, రాజాపూర్, కాచాపూర్, మొలంగూర్ తదితర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ పవిత్ర కార్యక్రమానికి మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై శ్రీ సీతారాములను దర్శించి తీర్థప్రసాదం స్వీకరించారు. ఆయనతో పాటు:
గ్రామ మాజీ సర్పంచులు: తాటికొండ సదానంద చారి, కాల్వ విజయ, కాటం వెంకట రమణారెడ్డి
మండల పరిషత్ మాజీ వైస్ ఎంపీపీ & ఎంపీటీసీ: మోతే ఎల్లారెడ్డి, భాగ్యలక్ష్మి
వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు
వివిధ రాజకీయ పార్టీలు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
ఈ వేడుక ఆలయ ప్రాంగణాన్ని పండుగ వాతావరణంగా మార్చేసింది. భక్తులు నారోపణలు చేస్తూ, హరినామసంకీర్తనలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు.
