shankarapatnam tahsildar” శంకరపట్నం తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన కే. సురేఖ

శంకరపట్నం (డిసి ప్రతినిధి):
శంకరపట్నం మండల తహసీల్దార్‌గా కే. సురేఖ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో సిద్దిపేటలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఆమెను, సాధారణ బదిలీల్లో భాగంగా కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన శంకరపట్నం మండలానికి ప్రభుత్వం బదిలీ చేసింది.శాసనసభ ఎన్నికల సమ‌యంలో ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించారు.

తాజాగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తహసీల్దార్ సురేఖను మండల కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది ఆత్మీయంగా స్వాగతించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ —
“మండల పరిధిలోని రైతులు, ప్రజలు భూ సమస్యలతోపాటు ఇతర శాఖాపరమైన సమస్యలపై నేరుగా నా వద్దకు రావచ్చును. వీటికి పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తాన‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *