Tdp Mahanadu” తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు

TDP Mahanadu celebrations in Karimnagar

Tdp Mahanadu”

శంకరపట్నం డిసి ప్రతినిధి మే 27: తెలుగు తమ్ముళ్లు సొంత గూటికి చేరుకుంటున్నార‌ని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ హడక్ కమిటీ సభ్యులు మోరె ప్రభాకర్ మంగళవారం తెలిపారు.

 పార్లమెంట్ హడ్ కమిటీ సభ్యులు మోరె ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు అండగా నిలిచిందని, ఎన్టీఆర్ ప్రారంభించిన రెండు రూపాయల కిలో బియ్యం పథకం ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు.

తాజాగా, కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం లింగాపూర్, తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం గ్రామాల్లో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభాకర్ పలు గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురవేసి ప్రసంగించారు.

ఎన్టీఆర్ అనంతరం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో విశేష సేవలందించిందని, Vision 2020 ద్వారా హైదరాబాద్ వంటి నగరాన్ని సాంకేతిక హబ్‌గా మార్చారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని పలు మారుమూల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవనాన్ని పొందుతోందని, పాత రోజుల తలపులు గుర్తుచేసుకుంటూ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు తిరిగి పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారని పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో సీనియర్ నేతలు బైరి తిరుపతి, సాబీర్, సాగర్, మహేష్, నరసింహారెడ్డి, శ్రీకాంత్, రామ్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, చిట్టి బాబు, ప్రశాంత్, వంశీ, రమేష్, అలాగే CPI నేత గోసెట్టి భద్రయ్య, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

క‌రీంన‌గ‌ర్ వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి 

Sony BRAVIA” 43 ఇంచుల టీవీ TV సమీక్ష.. అమెజాన్లో అద్బుత‌మైన ఆఫ‌ర్తో

Realme gt 7t vsgt7Review” పవర్‌ఫుల్ పనితీరు, ప్రీమియం డిజైన్ – Realme GT 7 సిరీస్ పూర్తి సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *