crime news” రోడ్డెక్కితే చాలు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ఏ వాహనం ఎటు నుంచి వచ్చి ఢీ కొంటుందో తెలియదు. నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గజ్వేల్ లో జరిగిన ఓ యాక్సిడెంట్‌ను తెలంగాణ పోలీస్‌లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. గజ్వేల్ – ప్రజ్నాపూర్ కు చెందిన శ్రావణ్(18) అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ వెనకాల కూర్చున్న శ్రావణ్ ఎగిరి డివైడర్‌పై పడ్డాడు. శ్రావణ్ తలకు బలమైన గాయాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటన పై తెలంగాణ పోలీస్‌లు స్పందించారు. వాహనాలపై మితిమీరిన వేగం నీ కుటుంబాన్నో, ఎదుటి వారి కుటుంబాన్నో రోడ్డున పడేలా చేస్తుందన్న విషయం మర్చిపోవద్దని ఎక్స్ వేదిక సూచించారు. పరిమితవేగంతో వాహనాలని నడపాలని తెలిపారు. విషాదంతో కూడిన గమ్యాన్ని కాదని సురక్షితమైన గమ్యాన్ని చేరుకోవాలని పేర్కొన్నారు.
వాహనాలపై మితిమీరిన వేగం నీ కుటుంబాన్నో, ఎదుటి వారి కుటుంబాన్నో రోడ్డున పడేలా చేస్తుందన్న విషయం మర్చిపోవద్దు. పరిమితవేగంతో వాహనాలని నడపాలి… విషాదంతో కూడిన గమ్యాన్ని కాదు, సురక్షితమైన గమ్యాన్ని చేరుకోవాలి.#RoadSafetyAwareness #Dial100 #TelanganaPolice pic.twitter.com/8Db3JyZAmu
— Telangana Police (@TelanganaCOPs) July 4, 2024
ఇవి కూడా చదవండి
Viral video” జెర్రుంటే సచ్చిపోతుండే.. భూమ్మీద నూకలు ఉండడం అంటే ఇదే.. వీడియో వైరల్
Hathars” యూపీలో తొక్కిసలాట.. 70 మంది మృతి.. ఇంకా పెరిగే అవకాశం
Viral video” సముద్రంలో ఇరుక్కున్న థార్స్… రీల్స్ కోసమేనా..? వైరల్ వీడియో