Hathars” యూపీలో తొక్కిసలాట.. 70 మంది మృతి.. ఇంకా పెరిగే అవ‌కాశం

Hathars

Hathars” ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హత్రాస్ లో ఘోర విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. తొక్కిస‌లాట‌లో 70 మంది వ‌ర‌కు మృతి చెందిన‌ట్టు స‌మాచారం. వంద‌ల సంఖ్య‌లో గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బోలే బాబా ప్ర‌వ‌చ‌నాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌క్తులు వ‌స్తుంటారు. జులై 2 మంగ‌ళ వారం ఏర్పాటు చేసిన ప్ర‌వ‌చ‌నాల‌కు ఎక్కువ సంఖ్య‌లో భ‌క్తులు వ‌చ్చారు. ప్ర‌వ‌చ‌నాలు ముగిసిన త‌రువాత బ‌య‌ట‌కు వెళ్తున్న క్ర‌మంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 70 మంది దుర్మ‌ణం పాల‌యిన‌ట్టు తెలుస్తోంది. ఇంకా వంద మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. గాయ‌ప‌డ్డ వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఈ ఘ‌ట‌న‌పై యూపీ సీఎం సీరియ‌స్ అయ్యారు. ఘ‌ట‌న‌పై పూర్తి కార‌ణాలు సేక‌రించి కార‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌న్నారు. గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని సూచించారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Lonovala Bhusi Dam” కండ్ల ముందే నీళ్ల‌లో కొట్టుకుపోయిన కుటుంబం.. వీడియో

Nagar kurnool news” ఘోర విషాదం… మట్టి ఇల్లు కూలి ఒకే ఇంట్లో నలుగురు మృతి

Viral video” స‌ముద్రంలో ఇరుక్కున్న థార్స్‌… రీల్స్ కోస‌మేనా..?  వైర‌ల్ వీడియో

Bapatla Beach” విషాదంగా విహార యాత్ర‌.. సముద్రంలో ఇద్ద‌రు మృతి.. న‌లుగురు యువకులు గ‌ల్లంతు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *