chicago Truck Accident” అమెరికాలో ఘోరం: ట్రక్కు ఢీకొట్టడంతో తెలంగాణ యువతి దుర్మరణం

 chicago Truck Accident” అమెరికాలోని చికాగో నగరంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తెలంగాణకు చెందిన యువతి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. మెడ్చల్ జిల్లా బాలాజీ నగర్‌కు చెందిన శ్రీను రావు కుమార్తె శ్రీజ వర్మ (23) అక్కడ ఒక యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్నది.

ఘటన జరిగిన రోజు రాత్రి, డిన్నర్ కోసం ఆమె రెస్టారెంట్‌కి నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుకనుంచి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

శ్రీజ వర్మ మరణ వార్తతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు, స్నేహితులు సహాయం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *