Crime news” డ్యాంలో నీటి మట్టం తగ్గింది. అందులో నుంచి ఓ కారు బయటపడింది. స్థానికులు కారు దగ్గరకు వెళ్లిచూడగా అంత షాక్ అయ్యారు. ఆ కారులో రెండు మానవ అస్థిపంజరాలు ఉన్నాయి.. వివరాల్లోకెళ్తే.. (madyapradesh) మధ్యప్రదేశ్ – కువారి నదిపై గోపి గ్రామ సమీపంలో నిర్మించిన స్టాప్ డ్యాంలో నీరు తగ్గుముఖం పట్టంది. నీటిమట్టం తగ్గడంతో అందులోనుంచి ఒక కారు బయటపడింది. ఆ కారులో ఒక అబ్బాయి, ఒక మహిళ అస్థిపంజరాలు కన్పించాయి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆరా తీశారు. దొరికిన (Skeletons) అస్థిపంజరాలు అంబాహ్ గ్రామానికి చెందిన అబ్బాయి నీరజ్ (26), వివాహిత మిథిలేష్ (32)గా గుర్తించారు.. వివాహిత మిథిలేష్ తప్పిపోయినట్టుగా ఆమె భర్త ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. కాగా అబ్బాయి నీరజ్ మిస్సింగ్‌పై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. హత్యలా…? ఆత్మహత్యలా…? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Crime news” డ్యాంలో తగ్గిన నీరు.. బయటపడ్డ కారు.. అందులో రెండు అస్థిపంజరాలు
Karimnagar crime news” పిల్లలను కాపాడబోయి తండ్రి మృతి.. కరీంనగర్ లో విషాదం..
train accident in bengal” బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. పల్టీలు కొట్టిన రైలు భోగీలు