అవగాహన పెంచుదాం- ఆదర్శంగా నిలుద్దాం…

-జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత ముఖ్యం..

-హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో డిసిపి కె.సురేష్ కుమార్

ఉప్పల్ – డీసి తెలుగు

సమాజాన్ని చైతన్య పరచడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని మల్కాజిగిరి కమిషనరేట్ ఉప్పల్ జోన్ డిసిపి కే. సురేష్ కుమార్ పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పోలీసులతో పాటి జర్నలిస్టులు కూడా తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారని అన్నారు. రోడ్డు భద్రతపై నియమ నిబంధనలను జర్నలిస్టులు ఆచరిస్తూనే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. మంగళవారం ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాల సౌజన్యంతో నిర్వహించిన జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసానందానంగా ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్య భద్రతపై కూడా దృష్టి సాధించాలన్నారు. వార్తా సేకరణతో పాటు సామాజిక సామాజిక అంశాలు, శాంతి భద్రతలు, నేరాల నియంత్రణలో జర్నలిస్టులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. జర్నలిస్టులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు.

అంతకుముందు లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయంతి రెడ్డి మాట్లాడుతూ సమాచార సేకరణతో పాటు సామాజిక సమస్యలపై జర్నలిస్టులు చేస్తున్న పోరాటాన్ని అభినందించారు. లిటిల్ ఫ్లవర్ విద్యాసంస్థలు ఉప్పల్ ప్రాంతంలో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని ఆమె వివరించారు. టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం ఆరోగ్య భద్రతకు ఉప్పల్ ప్రెస్ క్లబ్ చేస్తున్న కృష్ణుని అభినందించారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమంతో పాటు నిరంతరం సామాజిక చైతన్య, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న తోటి జర్నలిస్టులకు అండగా నిలుస్తామని, ఏడాది క్రితం ఆకస్మికంగా మృతి చెందిన జర్నలిస్టు మాదిరాజు సురేష్ కుటుంబాన్ని ఆదుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు . ఈ సందర్భంగా 30 మంది జర్నలిస్టులకు హెల్మెట్లను డిసిపి సురేష్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ విద్యాసంస్థల డైరెక్టర్ బ్రదర్ జాన్ కలరికల్, కళాశాల కరస్పాండెంట్ బ్రదర్ అరుణ్ ప్రకాష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయంతి రెడ్డి, ఉప్పల్ జోన్ అడిషనల్ డీసీపీ వెంకట్ రమణ, ఉప్పల్ ఏసీపీ వై వెంకట్ రెడ్డి, ఉప్పల్ ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి, ఎస్సైలు మధుసూదన్, వినయ్,సమత రెడ్డి,ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గ్యారంపల్లి శివాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పారేల్లి సాగర్, ఉపాధ్యక్షులు ఏవి శ్రీధర్ రావు, కూకుట్ల నరోత్తం రెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా హెల్త్ కన్వీనర్ కె,చంద్రమౌళి, కోశాధికారి గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీ దాస రాజు మరియు సీనియర్ జర్నలిస్టులు పల్లా మహేందర్ రెడ్డి, కోడికంటి శ్రీనివాస్, ఎం అశోక్, రాజు, ఓ.రమేష్, బాలరాజ్, రాజు, నరసింహ, స్టాలిన్, రవీందర్ రెడ్డి, నరేందర్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.