కరీంనగర్ ప్రతినిధి: కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఒక సువర్ణావకాశం లభించింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కరీంనగర్ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఒక ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 29.06.2026 (సోమవారం) రోజున కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ఉద్యోగ వివరాలు (Job Details):
-
సంస్థ పేరు: ఫ్లిప్‌కార్ట్ (Flipkart), కరీంనగర్ బ్రాంచ్.
-
పోస్టుల పేరు: డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ (Delivery Executives).
-
మొత్తం ఖాళీలు: 20 పోస్టులు.
-
వయోపరిమితి: 20 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వారు అర్హులు.
-
నెలవారీ జీతం: ₹15,000/- నుండి ₹25,000/- వరకు ఉంటుంది.

కావలసిన విద్యార్హతలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు SSC, ఇంటర్మీడియట్ (Inter), లేదా డిగ్రీ (Degree) ఆపై చదువులు ఉత్తీర్ణులై ఉండాలి.
ఇంటర్వ్యూ వేదిక & సమయం:
-
తేదీ: 29-06-2026 (సోమవారం)
-
సమయం: ఉదయం 11:00 గంటలకు ప్రారంభం.
-
వేదిక: జిల్లా ఉపాధి కార్యాలయం, ప్రభుత్వ ఈ-సేవ కేంద్రం పై అంతస్తు, ఫైర్ స్టేషన్ దగ్గర, కాశ్మీర్ గడ్డ, కరీంనగర్.
ఎలా అప్లై చేసుకోవాలి?
అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, వాటి జిరాక్స్ కాపీలను తీసుకొని నేరుగా ఇంటర్వ్యూ వేదిక వద్దకు చేరుకుని తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
ఈ జాబ్ మేళాకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు క్రింది ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు: 📞 9908230384 📞 9963357250
