Voter ist Updates” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు ఓటరు జాబితాలోని చేర్పులు, మార్పులు, తొలగింపులు పకడ్బందీగా నిర్వహించాలని బీఎల్వోలు (BLOలు)కి సూచించారు శిక్షకుడు కొండాల్ రెడ్డి. శుక్రవారం శంకరపట్నం మండలం కేశవపట్నంలోని రైతు వేదికలో బీఎల్వోల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని తహసీల్దార్ కె. సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో శిక్షకుడు కొండాల్ రెడ్డి మాట్లాడుతూ, “ఎన్నికల జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలు ఎన్నికల కమిషన్ జారీ చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం, నిర్ణీత గడువులోపే పూర్తి చేయాలి,” అని BLOలకు స్పష్టంగా సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, మృతి చెందినవారి తొలగింపు, చిరునామా మార్పులు వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె. సురేఖ, డిప్యూటీ తహసీల్దార్ పార్థసారథి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు ప్రత్యూష, బాలకృష్ణ, మండలంలోని అన్ని బీఎల్వోలు పాల్గొన్నారు.
Oppo Reno14 5G” సరికొత్త డిజైన్‌తో శక్తివంతమైన ఫోన్ ఇప్పుడు మార్కెట్‌లో
