Mp nidhulu”ఎంపీ నిధులతో కరీంపేట గ్రామంలో బోరు బావి – తాగునీటి సమస్యకు పరిష్కారం

Mp nidhulu” శంకరపట్నం డిసి ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో తాగునీటి అవసరాల కోసం కొత్త బోరు బావిని మంజూరు చేశారు. ఈ బోరుబావి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధులతో మంజూరయ్యింది.

ఈ విషయాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ సోమవారం తెలిపారు. గ్రామస్థుల విన్నపాన్ని స్వీకరించిన ఎంపీ బండి సంజయ్ తక్షణమే స్పందించి బోరుబావి మంజూరు చేశారు. ఈ సంద‌ర్భంగా పూజలు నిర్వహించి బోరు వేయించారు.

ఈ కార్యక్రమంలో మాజి ఎంపిటీసి గాండ్ల తిరుపతి, కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఖాజాపాషా, మాజి వార్డు సభ్యులు చింతం రాజేశం, శక్తి కేంద్రం ఇంచార్జి రాసమాల్ల శ్రీనివాస్, బిజెపి నాయకులు, అంబేద్కర్ సంఘం సభ్యులు సహా పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Right laptop” డిజిట‌ల్ యుగంలో సరైన ల్యాప్‌టాప్ ఎంపిక చేసుకోవడం ఎలా? — ప్రతి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *