Rajiv yuva vikasam” శంకరపట్నం డిసి ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద మండల స్థాయి కమిటీ సమావేశం మంగళవారం (నేడు) నిర్వహించనున్నారు. ఈ సమావేశం కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో, మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు జరుగనుంది.
ఈ మేరకు ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, బ్యాంకు అధికారులు ఈ సమావేశానికి హాజరై, రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసిన అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్టు అని పేర్కొన్నారు.
[pdf-embedder url=”https://dctelugu.com/wp-content/uploads/2025/05/27.5.2025.pdf”]
