Shankarapatnam Tahsildar”
శంకరపట్నం, మే 27 (డిసీ ప్రతినిధి):
మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలానికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన తాసిల్దార్ కే. సురేఖను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం (TAYS) మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు అంతడుపుల సతీష్ మాట్లాడుతూ, “పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల పట్ల మంచి సేవల నిబద్ధత చూపుతున్న తాసిల్దార్ సురేఖ గారిని అంబేద్కర్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న సంఘం తరఫున మేము మర్యాదపూర్వకంగా కలిసాము,” అని తెలిపారు.
తాజాగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో తాసిల్దార్‌గా పని చేసిన సురేఖ గారు, ఇటీవల కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలానికి బదిలీ అయ్యారు. ఈ తరుణాన్ని పురస్కరించుకుని టి.ఏ.వై.ఎస్ నేతలు ఆమెకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
-
దాసారపు భద్రయ్య – కల్వల మాజీ సర్పంచ్
-
బొజ్జ రవి – టి.ఏ.వై.ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
-
కనకం శంకర్, బొల్లారం రాజయ్య – సీనియర్ నాయకులు
-
త్యాదాసి భాస్కర్ – రాష్ట్ర నాయకుడు
-
ఇతర సంఘ నాయకులు, కార్యకర్తలు.
అందరూ కలిసి కొత్త తాసిల్దార్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజల సంక్షేమానికి పని చేయాలని ఆకాంక్షించారు.
Realme gt 7t vsgt7Review” పవర్ఫుల్ పనితీరు, ప్రీమియం డిజైన్ – Realme GT 7 సిరీస్ పూర్తి సమాచారం
Sony BRAVIA” 43 ఇంచుల టీవీ TV సమీక్ష.. అమెజాన్‌లో అద్బుతమైన ఆఫర్‌తో
