Local News”వడ్రంగికి తీవ్ర గాయాలు, 108 వాహన సాయం తో ఆసుపత్రికి తరలింపు

Local News” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన ముత్తోజు శ్రీనివాస్ అనే వడ్రంగి, తన కుటుంబాన్ని కుంటున్నాడు. ఈ క్రమంలో దూగడ మిషన్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కుడి చేయి బొటనవేలు మిషన్ లో ఇరుక్కోవడం వల్ల తీవ్ర గాయాలు చెందారు.

ఈ సంఘటన బుధవారం చోటుచేసుకున్నది. స్థానికులు ఈ ప్రమాదాన్ని చూసి 108 ఎమర్జెన్సీ సర్వీస్కు సమాచారం అందించారు. వెంటనే 108 వాహనము, ఈఎంటి సతీష్ రెడ్డి మరియు పైలెట్ ఖాజా ఖలీల్ ఘటన స్థలానికి చేరుకుని, బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్ ను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *