Metpalli cheruvu” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
శంకరపట్నం మండలంలోని మెట్పల్లి శివారులో గల పెద్ద చెరువును ఎస్సారెస్పీ (SRSP) అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఏఈ గంగాధర్ మాట్లాడుతూ.. చెరువు నీటిని కొంతమంది అక్రమంగా తొలగించడం వల్ల సాగు, తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు.
మెట్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు గొట్టే మధు మీడియాతో మాట్లాడుతూ.. చెరువు నీటిని దుర్వినియోగం చేస్తూ కొందరు వ్యక్తులు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వెల్లడించారు. పరిగణనలోకి తీసుకుని, అధికారులు చెరువును పరిశీలించారు.
ఈ ఘటనపై కేశవపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గంగాధర్ తెలిపారు. అలాగే, సంబంధిత శాఖాపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ పరిశీలనలో గ్రామస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
