kesavapatnam si shekhar reddy”
శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ కలిగిన నిందితులను హెచ్చరిస్తూ, ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి సోమవారం ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. నిందితులు తమ నేరప్రవృత్తిని విడనడి, కుటుంబాలతో సుఖసంతోషాలతో జీవించాలంటూ హితవు పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు పొందాలని, స్నేహసంబంధాలు పెంపొందించుకొని సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని” కోరారు.
“నేర కార్యకలాపాలకు పాల్పడిన వారిపై పోలీస్ శాఖ డేగ కన్ను వుంటుంది. వారి కదలికలను పరిశీలిస్తూ, అవసరమైనచోట చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ”
ఇకపై నిందితుల ప్రవర్తనను మదించి, మంచి ప్రవర్తన కలిగి ఉన్నవారికి పోలీస్ శాఖ నుండి మద్దతు లభిస్తుందని, అవసరమైతే బైండోవర్ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, నిందితులు పాల్గొన్నారు.
