Press club” శంకరపట్నం: డిసీ ప్రతినిధి
శంకరపట్నం మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తణుకు ప్రభాకర్ ను టీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ నాయకులు సోమవారం పరామర్శించారు. ఇటీవల హైదరాబాదులో మోకాలికి శస్త్ర చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జక్కోజు రమేష్ మాట్లాడుతూ, సేవా భావం కలిగిన తణుకు ప్రభాకర్ త్వరగా కోలుకుని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూఐజేయు జిల్లా కార్యవర్గ సభ్యులు గాజుల స్వామి, మండల ఉపాధ్యక్షులు బుర్ర సత్యనారాయణ, మండల నాయకులు దామెర సతీష్, గొట్టి అర్జున్, సీనియర్ జర్నలిస్ట్ మొలుగూరి వేణుగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
