Dalita ratna award” కనకం విద్యాసాగర్‌కు దళిత రత్న అవార్డు

 Dalita ratna award” శంకరపట్నం, కరీంనగర్:
సామాజిక సేవల రంగంలో విశేష కృషి చేసిన కనకం విద్యాసాగర్‌కు ప్రతిష్టాత్మకమైన దళిత రత్న అవార్డు లభించింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన విద్యాసాగర్‌ను, హైదరాబాద్ పట్టణంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టిఎంఆర్పిఎస్ (తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) ఆధ్వర్యంలో ఈ అవార్డుతో సత్కరించారు.

విద్యాసాగర్ సామాజిక దృక్పథంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీలకు సేవలందిస్తూ పేదవారికి విద్య, వైద్య సహాయంతో పాటు న్యాయ పరంగా అండగా నిలుస్తున్నారు. ఆయన “సాగర్ అన్న” అంటూ ప్రజల్లో ఆదరణ పొందారు. నిరుపేద కుటుంబాల్లో విద్యా అవసరాలే కాక వైద్య సేవలు కూడా అందిస్తూ, అన్యాయానికి గురైన దళిత కుటుంబాలకు న్యాయం జరగే వరకు పోరాటం చేస్తూ, అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో ఆయన సేవలను గుర్తించిన టిఎంఆర్పిఎస్, “దళిత రత్న”గా ఎంపిక చేసి ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ, “ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను కల్పించింది. నేను మరింత సమర్పణా భావంతో దళిత, బీసీ, మైనారిటీ వర్గాలకు సేవలందించేందుకు కృషి చేస్తాను,” అని అన్నారు.
అలాగే తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ అవార్డు ఆయన సేవలకు గుర్తింపు మాత్రమే కాదు, భవిష్యత్తులో మరిన్ని సామాజిక మార్పులకు మార్గదర్శిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *