Rajaka-sangham” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
మొలంగూర్ గ్రామానికి చెందిన యువకుడు తడిగొప్పుల సంపత్ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఇటీవల క్రిమిసంహారక మందు సేవించి మృతి చెందాడు. ఈ విషాద ఘటన అనంతరం, బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే మానవతా దృక్పథంతో శంకరపట్నం మండల రజక సంఘం నాయకులు ముందుకొచ్చారు.
శుక్రవారం రజక సంఘం నాయకులు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంఘ సభ్యులందరి సహకారంతో ఈ సహాయం అందించామని, బాధిత కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:
-
రాస మల్ల శ్రీనివాస్
-
కల్లేపల్లి క్రాంతి కుమార్
-
తాడిచర్ల తిరుపతి
-
కాల్వ మధు
-
నాంపల్లి శంకరయ్య
-
నాంపల్లి వెంకటేష్
-
దండు చిరు సాయికుమార్ తదితరులు
బాధిత కుటుంబ సభ్యులు రజక సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం మానవతా సేవను గ్రామస్తులు అభినందించారు.
