Bjp demands” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు.
సోమవారం శంకరపట్నం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను దహనం చేసి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమ్మిరెడ్డి మాట్లాడుతూ, “పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాదరణతో విజయం సాధించిన బండి సంజయ్ కుమార్‌పై అసభ్య వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ బద్ధ పదవికి అవమానం. మహేష్ కుమార్ గౌడ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే బీజేపీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు చేపడతాం” అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి సమాచారం తెలుసుకున్న కేశవపట్నం పోలీసులు అక్కడకు చేరుకొని నిరసనను శాంతియుతంగా ముగించించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
-
ఏనుగుల అనిల్ – బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు
-
వెంకటలక్ష్మి – మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు
-
బిజిలి సారయ్య – ఎస్టీ మోర్చా మండలాధ్యక్షుడు
-
కనకం సాగర్ – దళిత మోర్చా మండలాధ్యక్షుడు
-
కొయ్యడ అశోక్ యాదవ్ – మండల ఉపాధ్యక్షుడు
-
కొయ్యడ కుమార్ యాదవ్, రాస మల్ల శ్రీనివాస్, వీరార్జున్, సంపత్, చేర్ల శ్రీనివాస్
-
వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు

✨ బోష్ 9Kg ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్
5 స్టార్ రేటింగ్ | AI Active Water+ | Anti-Stain Power
ఇన్-బిల్ట్ హీటర్, Allergy Plus, Iron Steam Assist
Anti Tangle, Anti Wrinkle టెక్నాలజీ
Dark Silver లుక్స్‌తో ప్రీమియం ఫినిష్
ధర: ₹38,990 మాత్రమే! (25% తగ్గింపు)
200+ మంది గత నెలలో కొనుగోలు చేశారు!
అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/3JxC32I లింక్ పై క్లిక్ చేయండి..
