Uppal press club” ఉప్పల్‌ ప్రెస్‌క్లబ్‌ నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా వేముల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గ్యారంపల్లి శివాజీ

ఉప్పల్‌ DC Telugu : ప్రతిష్టాత్మకమైన ఉప్పల్‌ ప్రెస్‌క్లబ్‌కు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్‌ నూతన అధ్యక్షుడిగా వేముల తిరుపతిరెడ్డి ఎన్నికయ్యారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పి. సాగర్‌, ప్రధాన కార్యదర్శిగా గ్యారంపల్లి శివాజీ బాధ్యతలు చేపట్టనున్నారు.

    ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ్యారంప‌ల్లి శివాజి

అలాగే ఉపాధ్యక్షులుగా ఏ.వి. శ్రీధర్‌రావు, కూకట్ల నరోత్తమ్‌రెడ్డి, కోశాధికారిగా గుత్తి శేఖర్‌, జాయింట్‌ సెక్రటరీగా దాస రాజును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారులుగా కొలనుపాక చంద్రమౌళి, దొంతుల వెంకటరామ్‌రెడ్డి, కంచు శ్రీను, కోడి కంటి శ్రీనివాస్ వ్యవహరించనున్నారు.

ఈ ఎన్నికలను ఆడ్‌హక్‌ కమిటీ సభ్యులు వెంకట్రాంరెడ్డి, చంద్రమౌళి ఎన్నికల అధికారులుగా నిర్వహించారు. నూతన కమిటీకి బాధ్యతలు అప్పగించిన సందర్భంగా మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యవర్గం రెండేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు.

అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం వేముల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ జర్నలిజం విలువలను కాపాడటం, పాత్రికేయుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రెస్‌క్లబ్‌ సభ్యుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

ఉప్పల్‌ ప్రాంతంలోని జర్నలిస్టులను ఒకే వేదికపై ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి సంక్షేమానికి పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్‌ ద్వారా సామాజిక బాధ్యత కార్యక్రమాలు చేపట్టడం, యువ జర్నలిస్టులకు మార్గనిర్దేశం చేయడం, ప్రభుత్వ అధికారులతో సమన్వయం పెంపొందించడం తమ కార్యాచరణలో భాగమని వివరించారు.

పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని వేముల తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *