Wednesday , 15 January 2025
Breaking News

ఎటు చూసినా శ‌వాల గుట్ట‌లు.. క‌న్నీళ్లు.. ర‌క్త‌పాతం

హ‌మాస్ మిలిటెంట్ల దాడుల‌తో మొద‌లైన ర‌క్త‌పాతం రోజులు గ‌డిచినా ముగియ‌డం లేదు. హ‌మాస్ ను భూస్థాపితం చేసేదాకా విశ్ర‌మించేదీ లేద‌ని ఇజ్రాయిల్ ప్ర‌తిన‌బూనింది. వాయు సేనల ద్వారా దాడికి దిగ‌డంతో పాటు ఇప్పుడు భూత‌ల దాడికి రంగం సిద్ధం చేసుకుంది. గాల్లో నుంచి దూసుకొస్తున్న రాకెట్లు నేల‌మ‌ట్టం మ‌వుతున్న భ‌వంతులు భీక‌ర శ‌బ్దాల మ‌ధ్య గాజాలో రోజులు గ‌డిచిపోత‌న్నాయి..
క‌రెంటు లేదు. రాత్రిళ్లు చిమ్మ‌చీక‌ట్లు అలుముకుంటున్నాయి. గుక్కెడునీళ్లు లేవు. అన్నం లేదు. ప‌స్తులుంటున్న కుటుంబాలెన్నో.. ఉత్తర గాజాను విడిచి వెళ్లాల‌న్న ఇజ్రాయిల్ ప్ర‌క‌ట‌న‌తో ల‌క్ష‌లాది మంది పెట్టేబేడ స‌దురుకుని ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని ప‌రుగులు పెడుతున్నారు. మ‌రో వైపు హ‌మాస్ ఇండ్ల‌ను విడిచి వెళ్లొద్ద‌ని ఆదేశాలు జారీ చేస్తోంది. దీంతో పాటు ఇజ్రాయిల్ పైకి రాకెట్ల వ‌ర్షం కురిపిస్తూనే ఉంది. రెండు వైపులా ప్రాణం న‌ష్టం, ఆస్తి న‌ష్టం వాటిల్లుతూనే ఉంది. ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ప్ర‌పంచ దేశాలూ ఈ యుద్దం పై ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి. ఇరువ‌ర్గాల మ‌ధ్య సంది కుదుర్చాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టిక ఫ‌లితం క‌న‌బ‌డ‌డం లేదు.

ఎదురుగా మిలిటెంట్లు… వంద బుల్లెట్లు కాల్చినా బ‌తికిండు

ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 2700 మందికిపైగా మృతి చెందారు. శ‌వాల‌ను క‌ప్పేందుకు బాడీ బ్యాగ్‌ల లేవు. శ‌వాల‌ను భ‌ద్ర‌ప‌రిచేందుకు ఫ్రీజ‌ర్ లేక‌పోవ‌డంతో ఐస్ క్రీమ్ ట్ర‌క్కుల్లో ఉంచుతున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి స్వయంగా తెలిపింది. ఇక‌పై గాజాలో ప్ర‌జ‌లెవ్వ‌రూ నివ‌సించే ప‌రిస్థితులు ఉండ‌వోబ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. లాజిస్టిక్స్ బేస్‌లో వంద‌లాది మంది కేవ‌లం ఒకే ఒక టాయిలెట్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. అక్టోబ‌ర్ 7 ప్రారంభ‌మైన ఈ మార‌ణ హోమం ఇరువైపుల తీవ్ర సంక్షోభాన్ని మిగిల్చ‌నుంది. హమాస్ మిలిటెంట్ల చెర‌లో ఇజ్రాయిల్ దేశానికి చెందిన 199 మంది పౌరులు బందీలుగా ఉన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

బందీలుగా ఉన్న పిల్ల‌ల బాగానే చూసుకుంటున్నాం హ‌మాస్ వీడియో విడుద‌ల‌.. మ‌నం ఓడించ‌బోతున్న‌ది వీళ్ల‌నే ఇజ్రాయిల్ కౌంట‌ర్

షి’కారు’లో రోమాన్స్.. స్వేచ్చ ఉంది క‌దా అని.. స‌జ్జ‌నార్ ట్విట్.. వీడియో వైర‌ల్‌

హోట‌ళ్లకు రేటింగ్ ఇవ్వాలి.. 13 ల‌క్ష‌లు హాం ఫ‌ట్‌

రిటైర్డ్ నేవి ఆఫీస‌ర్‌కు సైబ‌ర్ వ‌ల.. రూ. 2.37 ల‌క్షల మోసం

About Dc Telugu

Check Also

14.01.2025 D.C Telugu Cinema

12.01.2024 D.C Telugu Cinema

OnePlus

OnePlus” వ‌న్ ప్ల‌స్ 13 స్మార్ట్ ఏఐ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్

OnePlus ” వ‌న‌ప్ల‌స్ నుంచి భారీ ఫోన్ రిలీజ్ అయ్యింది. వివ‌రాలు చూసుకున్న‌ట్ట‌యితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com