ఉన్న‌తాధికారిణి దారుణ హ‌త్య‌

క‌ర్నాట‌క మైన్స్ అండ్ జియాల‌జీ శాఖ‌లో డిప్యూటీ డైరెక్ట‌ర్ హోదాలో ప‌నిచేస్తున్న ప్ర‌తిమ అనే అధికారిణి దారుణ హ‌త్య‌కు గురైంది. బెంగుళూరు లోని సుబ్ర‌మ‌ణ్య‌పుర ఏరియాలో శ‌నివారం హ‌త్య జ‌ర‌గ‌గా ఆదివారం వెలుగులోకి వ‌చ్చింది. రోజూలాగే విధులు ముగిసిన త‌రువాత ఆమెను కారు డ్రైవ‌ర్ ఇంటి వ‌ద్ద దించి వెళ్లాడు. ఆమె భ‌ర్త‌, కొడుకు ఇద్ద‌రు సొంత గ్రామ‌మైన శివ‌మొగ్గ‌లోని తీర్థ‌హ‌ళ్లికి వెళ్లారు. దీంతో ప్ర‌తిమ ఇంట్లో ఒంటరిగా ఉన్న‌ది. ఈ క్ర‌మంలో ఒంట‌రిగా ఉన్న ప్రతిమ‌పై గుర్తు తెలియ‌న వ్య‌క్తులు క‌త్తితో దాడి చేసి హ‌త్య చేశారు. ఆమె అన్న‌య్య ఎన్ని సార్లు ఫొఫోన్ చేసినా ఎత్త‌క పోవ‌డంతో ఆదివారం ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉండ‌డంతో పోలీసులకు చెప్పాడు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు కేసు న‌మోదు చేసి నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు 3 స్పెష‌ల్ టీంల‌ను ఏర్పాటు చేశారు.

 

కారులో లిక్క‌ర్‌.. అందిన‌కాడికి సంక‌లేసుక‌పోయారు. వీడియో వైర‌ల్

నేపాల్‌లో భారీ భూకంపం 128 మంది మృతి

పొలంలో క‌రెంట్ తీగ‌.. లాగితే భార్య డొంక క‌దిలింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *