ధరణి పోర్టల్‌ను బరాబర్ బంగాళాఖాతంలో కలుపుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస ప్రజా గర్జన సభలో బుధవారం (నవంబర్ 8)న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ధరణి రద్దు చేస్తే రైతు బంధు రద్దు అవుతుందుని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హైదరబాద్ పరిసర భూములను ధరణి ముసుగులో కబ్జా చేశారని ఆరోపించారు. బీఆర్ ఎస్ – బీజేపీ కోట్ల రూపాయలు ఉన్న వారికే టికెట్లు ఇస్తున్నాయని, ఓట్లున్నవారికే కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ఏ సబ్ స్టేషన్ కైనా పోదామా అని ప్రశ్నించారు. 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే నామినేషన్ వేయనని సవాల్ విసిరారు. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటానని ఇంద్రవెల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానన్నారు. అధికారంలోకి రాగానే ఆదివాసులు, లంబాడీ ల మధ్య పంచాయతీని కాంగ్రెస్ తీరుస్తందని హామి ఇచ్చారు.
పువ్వులేవీ..? ప్రియాంక గాంధీ.. బొకే చూసిన నవ్విన వైనం వీడియో వైరల్
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల నాలుగో విడత జాబితా పెండింగ్‌లో 19 స్థానాలు
Excellent article. I absolutely love this website. Stick with it!