అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేం ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతాంగమంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి, బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, రూ.500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. తుపాన్ కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిశాయని, వాళ్ళను ఆదుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చాక రైతుబంధు కింద ఎకరాకి రూ.15,000 డిసెంబర్ 9వ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఎప్పుడు రైతుబంధు ఇస్తారో చెప్పాలని హరీష్ రావు ప్రశ్నించారు.
అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేం ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి @BRSHarish స్పష్టం చేశారు. రైతాంగమంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి, బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.… pic.twitter.com/JkjoZaqEZl
— BRS Party (@BRSparty) December 9, 2023
వైద్యుల పర్యవేక్షణలో నడుస్తున్న మాజీ సీఎం వీడియో విడుదల
బీఆర్ ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నిక