ప్రియుడి మోజులో పడి కన్న కొడుకును చంపిన కేసులో ఇద్దరికి నల్గొండ జిల్లా కోర్టు జీవితఖైదును శిక్షగా విధించింది. నల్గొండ మండలం బుద్దారంలో విజయ వెంకన్న భార్యాభర్తలు. ఈ క్రమంలో విజయకు తోకల వెంకట్ రెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. కొడుకుని తల్లి విజయ, వెంకట్‌రెడ్డి కలిసి టవల్‌తో గొంతు నులిమి చంపేశారు. కేసును తప్పుదోవ పట్టించడానికి.. తన కొడుకుకి ఫిట్స్ వచ్చి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చిన నల్గొండ రూరల్ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీఐ బాషా ఆధ్వర్యంలో ఎంక్వయిరీ చేపట్టారు. 2020 ఫిబ్రవరి 21 శివరాత్రి రోజు కేసు నమోదు చేశారు. అయితే ఈ విచారణలో బాలుడి గొంతుని తల్లి నులిమి చంపినట్లుగా తేలింది. ఈ కేసులో కన్నతల్లి విజయ, ప్రియుడు వెంకట్ రెడ్డిలకు నల్గొండ డిస్టిక్ట్ సెషన్ జడ్జి జీవిత ఖైదీగా ఇద్దరికి శిక్ష విధించారు.
TS RTC” క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ
Anand Mahindra” ఆనంద్ మహింద్రాను ఆకర్షించిన పానీపూరీ బండి: వీడియో వైరల్
Crazy Run out” ఎం అన్నా క్యాచ్‌లు ఆడుకుంటుర్రా… సీరియస్ మ్యాచ్‌లో కామెడీ