Babu Mohan” పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి తెలంగాణలో గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి, ప్రముఖ సినీ యాక్టర్ బాబూ మోహన్ భారతీయ జనత పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఈ మేరకు
ప్రెస్ క్లబ్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు. బీజేపీ కోసం తాను చాలా కష్టపడి పనిచేసినన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే పార్టీకి రాజీనామా చేయడానికి ముఖ్య కారణం మాత్రం బాబు మోహన్ వరంగల్ నుంచి పార్లమెంట్ స్థానాని పోటీ చేస్తానన్నట్టు సమాచారం. దీనికి పార్టీ నాయకులు నిరాకరించడంతో బాబు మోహన్ రాజీనామా చేసినట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన ప్రెస్‌మీట్‌లో చెప్పకనే చెప్పారు. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని తాను నిర్ణయం తీసుకున్నాన్నారు. జీవితంలో కచ్చితంగా ఒక్కసారైనా అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని స్పష్టం చేశారు.
Babu Mohan”
group-1″ గ్రూప్‌వన్‌లో పెరిగిన పోస్టులు