BRS Mla lasya Nandita” మొన్న ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డి… నేడు మ‌రో ప్ర‌మాదంలో మృతి

BRS Mla lasya Nandita

BRS Mla lasya Nandita” రోడ్డు ప్ర‌మాదంలో బీఆర్ఎస్ మ‌హిళా నాయకురాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాస‌న స‌భ్యులు (ఎమ్మెల్యే) (BRS Mla lasya Nandita)లాస్య నందిత (37) మృతి చెందారు. శుక్ర‌వారం ఫిబ్ర‌వ‌రి(23) తెల్ల‌వారుజామున ఆమె ప‌టాన్ చెరు ఓఆర్ ఆర్ ప్ర‌యాణిస్తున్న ఆమె కారు అదుపుతప్పి డివైడ‌ర్ ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఆమె అక్క‌డికక్క‌డే మృతి చెందింది. కారు న‌డుపుతున్న డ్రైవ‌ర్‌కు తీవ్ర‌గాయాలు కాగా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.
మొన్న ప్ర‌మాదం…
ఇటీవ‌ల న‌ల్గొండ‌లో నిర్వ‌హించిన స‌భ‌కు హాజ‌రై తిరిగి వెళ్తున్న క్ర‌మలో (BRS Mla lasya Nandita) ఆమె కారు ప్ర‌మాదానికి గురైంది. ఆ ప్ర‌మాదంలో హోం గార్డు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆరోజు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డిన కొద్దిరోజుల‌కే ప్ర‌మాదంలో మృతి చెందింది.
గ‌త సంవ‌త్స‌రం తండ్రి..
గత సంవ‌త్స‌రం ఆమె తండ్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎల‌క్ష‌న్‌లో బీఆర్ఎస్ నాయ‌కులు సాయన్న కూతురు లాస్యకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వ‌గా ఆమె (BRS Mla lasya Nandita) ఎమ్మెల్యేగా గెలుపొందింది. అసెంబ్లీలో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఆమె ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెంద‌డం బాధాక‌రం

ఇవి కూడా చ‌ద‌వండి

Ts Rtc Bus” సీట్ల‌పై నుంచి న‌డిచి టిక్కెట్టు.. వీడియో పోస్టు

hyderabad Police” మీది మొత్తం వెయ్యి అయ్యింది.. పోలీసుల మీమ్ వైర‌ల్ .. యూజ‌ర్ చార్జీలు ఎక్స్ ట్రా

563 పోస్టుల‌తో గ్రూప్ వ‌న్ కొత్త నోటిఫికేష‌న్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *