Car Helicopter” ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అనేది ఓ సామెత. మన దేశ యువత ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలతో దూసుకెళ్తున్నారు. కొన్ని అవసరాలకు తయారు చేసుకుంటారు. మరికొన్ని కోరికతో తయారు చేస్తారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొత్త ఆవిష్కరణలు చేయడం ఎక్కువగా కనబడుతోంది. అటువంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతున్నది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇద్దరు సోదరులు అద్బుతమైన ఆవిష్కరణ చేసి (Talent) టాలెంట్ ఎవడి సొత్తు కాదని నిరూపించారు. ఓ పాత మారుతి కారును తీసుకుని దాన్ని హెలికాప్టర్లా మార్చేశారు. అచ్చం (Car Helicopter)హెలికాప్టర్ పోలి ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ నోటా ఈ నోటా పోలీసుల దాకా చేరింది. ఉత్తర ప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు ఆ కారును పరిశీలించారు. నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ కారును సీజ్ చేశారు.
यूपी के अंबेडकर नगर में दो भाईयों ने जुगाड़ से कार को हेलीकॉप्टर बना दिया. डेंट- पेंट कराने जा रहे थे तभी पुलिस ने पकड़ लिया. और गाड़ी(हेलीकॉप्टर) सीज कर दी. pic.twitter.com/wK9QLaFZ1k
— Priya singh (@priyarajputlive) March 17, 2024
ఇవి కూడా చదవండి
Governor of Telangana” తెలంగాణ కొత్త గవర్నర్గా రాధాకృష్ణన్
Lion viral video” సింహం ఆప్యాయంగా హత్తుకుంటూ… వీడియో వైరల్
Viral video” పిల్లల క్రియేటీవిటీ అదుర్స్… కట్టెలతో రంగుల రాట్నం.. వీడియో వైరల్