Drowning Godavari River”గోదావరి నదిలో మునిగిపోతున్న తండ్రిని రక్షించబోయి.. కూతురు మృతి

Drowning Godavari River

Drowning Godavari River” కండ్ల ఎదుటే తండ్రి నీళ్ల‌లో మునిగిపోతుంటే తండ్రిని ర‌క్షించాల‌ని పరుగున వెళ్లి చేయి అందించింది. కానీ తండ్రి క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు ఆ చిన్నారి నీళ్ల‌లో మునిగి మృతి చెందింది. ఈ విషాదక‌ర ఘ‌ట‌న ములుగు జిల్లా మంగ‌పేట మండ‌లం క‌మ‌లాపురంలో సోమ‌వారం చోటు చేసుకుంది.

Image

వివ‌రాల్లోకి వెళ్తే.. మంగపేట మండలంలో కమలాపురానికి చెందిన నిఖిత(13) సమీపంలోని గోదావరి నది వద్దకు తండ్రితో క‌లిసి వెళ్ళింది. ఈ క్ర‌మంలో తండ్రి సరదాగా స్నానం చేసేందుకు గోదావరిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఈతరాక మునిగిపోతుండగా ఒడ్డున ఉన్న కుమార్తె గ‌మ‌నించి చేయి అందించి బయటకు లాగింది. ఇదే క్రమంలో బండమీద నుంచి నిఖిత కాలుజారి గోదావరిలో పడి మునిగి మృతి చెందింది. కొద్ది దూరంలో ఉన్న జాల‌ర్లు, మిష‌న్ భ‌గీర‌థ సిబ్బంది వ‌చ్చి నిఖిత‌ను బయ‌ట‌కు తీయ‌గా అప్ప‌టికే మృతి చెందింది. నిఖిత మృతి తెలుసుకున్న గ్రామ‌స్తులు క‌న్నీరుమున్నీర‌య్యారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Ts Rtc” బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

Old age Couple Marriage” ఆయనకు 80.. ఆమెకు 75.. వివాహం చేసుకున్న వృద్ధ దంపతులు

Viral Video” మేనల్లుడి పెండ్లిలో డ్యాన్స్ చేస్తు ఒక్క‌సారిగా.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *