Mp elections” ఈ ఎన్నికల్లో కొందరు అత్యధిక మెజారిటీతో గెలుపొందింతే.. మరికొందరు అత్యంత స్వల్ప మెజారిటీతో ఒడ్డెక్కారు. (maharastra) మహారాష్ట్రలో ఓ (Mp)ఎంపీ అభ్యర్థి జస్ట్ 48 ఓట్ల తేడాతో గెలుపొంది రికార్డుల్లోకెక్కారు. (Mumbai)ముంబయి నార్త్‌వెస్ట్ ఎంపీ స్థానం నుంచి ఏక్‌నాథ్ శిండే వర్గం శివసేన పార్టీ తరుపున రవీంద్ర దత్తారామ్ వైకర్ పోటీ చేశారు. ఉద్ధవ్ ధాక్రే శివసేన (యూబీటీ) పార్టీ నుంచి అన్మోల్ కీర్తికర్ నిలబడ్డారు. వీరి ఇద్దరి మధ్య ఆద్యంతం గెలుపు అటుఇటుగా సాగింది. చివరికి 48 ఓట్ల తేడాతో ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన రవీంద్ర దత్తారామ్ గెలుపొందారు. ఇందులో దత్తారామ్‌కు 4,52,644 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి అన్మోల్‌కు 4,52,596 ఓట్లు పడ్డాయి. (Nota) నోటాకు 15,161 ఓట్లు పడటం విశేషం. ఆ తర్వాత (Kerala) కేరళ రాష్ట్రంలోని అత్తింగళ్ లోక్‌సభ స్థానంలో (congress) కాంగ్రెస్ అభ్యర్థి అడ్వొకేట్ అదూర్ ప్రకాశ్ తన దగ్గరి ప్రత్యర్థిపై 684 ఓట్లతో గెలుపొందారు. ప్రకాశ్‌కు 3,28,051 ఓట్లు పోలవగా.. 3,27,367 ఓట్లతో (cpm) సీపీఎం క్యాండిడేట్ వీ జారు సెకండ్ లో నిలిచారు. ఇక్కడ (Nota) నోటాకు 9,791 ఓట్లు వేశారు. ఒడిశాలోని జయపురంలో (Bjp) భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రబీంద్ర నారాయణ్ బెహరా (5,34,239 ఓట్లు).. తన సవిూప బిజూ జనతాదళ్ క్యాండిటే శర్మిష్ఠా సేథి (5,32,652)పై 1,587 ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ (Nota) నోటాకు 6,788 ఓట్లు పోలయ్యాయి. (rajastan) రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ రూరల్‌లో కాంగ్రెస్ క్యాండిడేట్ అనిల్ చోప్రా (6,16,262).. బీజేపీ క్యాండిడేట్ రాజేంద్ర సింగ్ (6,17,877 ఓట్లు) చేతిలో 1,615 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఈడా సుత మెజార్టీ కంటే (Nota) నోటాకే అత్యధికంగా 7,519 ఓట్లు పడడం గమనార్హం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ స్థానంలో బీజేపీ క్యాండిడేట్ భోజ్‌రాజ్ నాగ్ (5,97,624).. తన సవిూప (congress) కాంగ్రెస్ క్యాండిడేట్ బీరేశ్ ఠాకుర్ (5,95,740)పై 1,884 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ (Nota) నోటాకు ఏకంగా 18,669 ఓట్లు పోలయ్యాయి..
ఇవి సుత చదవండి
Pm modi” ప్రధాని మోడీ రాజీనామా..
winning mp’s” తెలంగాణాలో కాంగ్రెస్.. బీజేపీ సగం సగం.. గెలుపొందిన ఎంపీలు వీరే..
Hair cutting Viral Video” హెయిర్ కటింగ్ కు ఇన్ని కొలతలా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైరల్
Pushpa-2″పుష్ప-2…సూసేకి అగ్గిరవ్వ పాట విడుదల
Viral Video” పది పరీక్షలు పదిసార్లు రాసి పాసయ్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో
Kashmir Real Heros” నిజమైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువకులు.. వీడియో వైరల్
Bhadradri Kothagudem” భద్రాద్రి జిల్లాలో ఘోరం.. నిర్లక్ష్యానికి మూడేండ్ల చిన్నారి మృతి