Kothur Junction” డీసీఎం యూట‌ర్న్‌.. లారీ అదుపు తప్పి మ‌రో లారీని ఢీ… స్కూటీ మీద వెళ్తున్న వ్య‌క్తి మృతి.. వీడియో

Kothur Junction

Kothur Junction” కొత్తూరు జంక్షన్‌ వద్ద ప్రమాదం
కొన్ని సార్లు మ‌న త‌ప్పు లేకున్నా ఎదుటి వారి నిర్ల‌క్ష్యమో.. అతి వేగ‌మో వ‌ల్లనో ఎటువంటి త‌ప్పులేని వారిని చావు వెంటాడుతోంది. రోడ్డు మీద‌కి వచ్చామంటే ఏ వాహ‌నం ఎటునుంచి వ‌చ్చి ఢీకొంటుందో తెలియ‌దు.
రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు వై జంక్షన్ ద‌గ్గ‌ర‌ ఓ డీసీఎం యూటర్న్‌ తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ది. అదే సంద‌ర్భంలో పైపుల లోడుతో వస్తున్నఓ కంటైనర్‌ డ్రైవర్‌ దగ్గరికి వచ్చినంక డీసీఎంను చూసిండు. దీంతో ఆగ‌మాగం అయిన డ్రైవ‌ర్ లారీని కుడివైపు తిప్పాడు. దీంతో లారీ అదుపు త‌ప్పి డీసీఎంను ఢీ కొడుతూ రోడ్డుకు అవత‌ల నుంచి కాట‌న్ లోడ్‌తో వెళ్తున్న మ‌రో కంటైనర్ ఢీ కొట్టింది. ఈ స‌మ‌యంలో కాట‌న్ కంటైన‌ర్ ప‌క్క‌నుంచి స్కూటిపై వెళ్తున్నఇద్ద‌రు వ్య‌క్తుల‌పై కాట‌న్ లారీ ప‌డిపోయింది. ఈ విషాద‌క‌ర రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్ష‌న్ వ‌ద్ద శుక్ర‌వారం చోటు చేసుకుంది. ఈఘ‌ట‌న‌లో స్కూటిపై వెళ్తున్న‌ పెంజర్ల గ్రామానికి చెందిన కందివనం అంజయ్య అనే వ్య‌క్తి మృతి చెందాడు. మృతదేహాన్ని షాద్‌నగర్ లోని కమ్యూనిటీ ద‌వాఖానాకు తరలించారు. స్కూటీ వెనుకాల ఉన్న దినేష్‌కు గాయాల‌య్యాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Hyderabad news” ట్రాన్స్ జెండర్ దారుణ హత్య..

Viral Video”చుట్టుముట్టిన మొస‌ళ్లు.. కొట్లాడి త‌ప్పించుకున్న జీబ్రా.. వీడియో వైర‌ల్

Nashik accident” లోయలో పడ్డ బస్సు.. వీడియో తీస్తుండ‌గానే ఘ‌ట‌న

Crime news” అతివేగానికి యువకుడు బలి.. ప‌రిమితంతో వాహ‌నాల‌ను న‌డ‌పాలి.,. తెలంగాణ పోలీస్ సూచ‌న వీడియో పోస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *