Tamilanadu Crime news” దారుణ హ‌త్య.. వీడియో వైర‌ల్

Tamilanadu Crime news

Tamilanadu Crime news”  పోలీసులు ఎన్ని చ‌ర్యలు తీసుకున్నా నేరాలు ఆగ‌డం లేదు. క్ష‌ణికావేశాలో.. పాత ప‌గలో కానీ నిత్యం ఎక్క‌డో ఏ ఓ చోట హ‌త్య‌లు  జ‌రుగుతూనే ఉన్నాయి. ఏ మాత్రం భ‌యం లేకుండా జ‌నాల మ‌ధ్యే దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారు. త‌మిళ‌నాడులోని ఓ హోట‌ల్లో జ‌రిగిన హ‌త్య‌ను చూస్తే ఇది నాగ‌రికమా… అనాగ‌రిక‌మా అనే అనుమానం క‌లుగుతోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని ధ‌ర్మ‌పురి తాలుకాలోని ఎల‌క్కియాంప‌ట్ కు చెందిన మ‌హ్మ‌ద్ యాషిక్(25)  ఓ హోట‌ల్‌లో ప‌నిచేస్తున్నాడు. ఈ క్ర‌మంలో మ‌హ్మ‌ద్ యాషిక్ హోట‌ల్లో ఉండ‌గా న‌లుగురు వ్య‌క్తులు హోట‌ల్‌లో కి వ‌చ్చి యాషిక్ ను చుట్టుముట్టారు. త‌ర్వాత వెంట తెచ్చుకున్న క‌త్తులు, రాడ్ల‌తో దాడికి దిగారు. ఆ త‌ర్వాత వెంట‌నే అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు హోట‌ల్‌కు చేరుకుని ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న యాషిక్‌ను ఆస్ప‌త్రికి త‌రలించారు. ఆస్ప‌త్రికి త‌ర‌లించే లోపే యాషిక్ ప్రాణాలు కోల్పోయాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒక‌రిని అరెస్ట్ చేశారు. మిగితా వారికి కోసం గాలిస్తున్నారు. యాషిక్ ఓ మ‌హిళ‌తో చ‌నువుగా ఉండేవాడ‌ని, ఇటీవ‌ల ఆమెను పెండ్లిచేసుకోవాల‌ని కోరిన‌ట్టు తెలుస్తున్న‌ది. దీంతో ఆమె సోద‌రులు ఇద్ద‌రు ప‌ద్దతి మార్చుకోవాల‌ని, ఆమెకు దూరంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. అయిన యాషిక్ ఆమెకు ద‌గ్గ‌రయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ఆ మ‌హిళ సోద‌రులు మ‌రో ఇద్ద‌రితో క‌లిసి ఈ దారుణానికి తెగ‌బ‌డ్డ‌ట్టు తెలుస్తున్న‌ది. పోలీసుల విచార‌ణ త‌ర్వాత పూర్తి వివ‌రాలు తెలియ‌నుంది. అయితే ఈ హ‌త్య‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చ‌ద‌వండి

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

Kakinada Road Accident” ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అన్న‌ద‌మ్ములు స్పాట్ డెడ్

Funny Video” ఇది వైరైటి పార్కింగ్‌.. న‌డుములు విరిగాయ్.. వీడియో వైర‌ల్

Viral Video” ఈ బుడ్డోడి తెలివికి హ్యాట్స‌ఫ్ ..

Train Vrial Video” చెబితే విన‌రు. .ఫేమ‌స్ అవ‌డం కోసం.. కాలు, చేయి పొగొట్టుకున్న‌డు.. వీడియో

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *