Lorry Accident” పాఠ‌శాల విద్యార్థిని పై నుంచి వెళ్లిన లారీ… సీసీ వీడియో

Lorry Accident

Lorry Accident” త‌న త‌ల్లితో క‌లిసి పాఠ‌శాల నుంచి ఇంటికి వెళ్తున్న ఆరో త‌ర‌గ‌తి విద్యార్థిని పై నుంచి దూసుకెళ్లింది. తీవ్ర‌గాయాల‌తో విల‌విలాడుతూ మ‌ర‌ణించింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని హబ్సిగూడలో గురువారం (ఆగస్టు 29) సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ పాఠ‌శాల‌లో 6వ తరగతి చదువుతున్న ప‌దేండ్ల కామేశ్వరి అనే విద్యార్థిని తన తల్లి సంతోషి, అదే పాఠశాలలో సెకెండ్ క్లాస్ చ‌దువుతున్న తమ్ముడు వేదాంష్‌తో కలిసి ఇంటికి వెళ్తోంది. ఈ క్ర‌మంలో వెనుక నుంచి వ‌చ్చిన లారీ వీరి స్కూటీని ఢీకొట్టింది. దీందో సంతోషి, వేదాంష్‌లు రోడ్డుకు ఎడమవైపు పడిపోయారు. కామేశ్వరి కుడివైపున‌కు ప‌డిపోయింది. దురదృష్టవశాత్తు లారీ కామేశ్వరిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. గ‌మ‌నించిన స్థానికులు వెంటనే ఆమెను ద‌వాఖానాకు తరలించిన‌ప్ప‌టికీ ప్రాణాలు ద‌క్క‌లేదు. కామేశ్వ‌రీ మృతి చెంద‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు, బంధువులు దుఃఖంలో మునిగిపోయారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Nizamabad News” పెండ్లి విందులో మటన్ ముక్కలు రాలే.. వధువు, వరుడు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

Anand Mahindra tweet” దోమ‌ల‌పై పోరాటానికి ఐర‌న్ డోమ్‌.. ఆనంద్ మ‌హింద్ర ట్విట్‌.. వీడియో వైర‌ల్‌

Bangalore Highway Accident” ఒక‌దానికొక‌టి ఢీకొన్న 8 కార్లు.. 4 లారీలు.. ఒక‌రు స్పాట్ డెడ్.. ఇగో వీడియో

Up Rail News” రైల్వే ప‌ట్టాల‌పై గాఢ నిద్ర‌.. త‌ర్వాత ఏమైదంటే.. వీడియో వైర‌ల్

Nepal Accident” నదిలో ప‌డ్డ బస్సు 14 మంది మృతి.. నేపాల్‌లో ప్రమాదం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *