Tamil Nadu Crime News” తనని ప్రేమించలేదని కోపంతో టీచర్‌ను తరగతి గదిలోనే పొడిచి చంపాడో ఉన్మాది. వివరాలు పరిశీలిస్తే తమిళనాడులోని తంజవూరు మల్లిపట్నం ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో బుధవారం (నవంబర్ 20) చోటు చేసుకుంది. రమణి అనే అనే ఉపాధ్యాయురాలు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మదన్ కుమార్ అనే వ్యక్తి రమణిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు.ఈ క్రమంలో పెళ్లి ప్రతిపాదనతో ఆమె కుటుంబాన్ని సంప్రదించాడు. ఈ విషమై ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. దీంతో కోపోద్రిక్తుడైన మదన్ కత్తితో పాఠశాలకు వచ్చాడు. తరగతి గదిలో పాఠాలు బోధిస్తున్న రమణి మెడపై కత్తితో పొడిచాడు. తెరుకునే లోపే రమణి రక్తమడుగులో పడిపోయింది. గమనించిన సిబ్బంది, తోటి ఉపాధ్యాయులు ఆమెను దగ్గర్లోని దవాఖానాకు తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మదన్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఖండించారు. హింసను సహించబోమని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలావుండగా, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి హత్యను తీవ్రంగా ఖండించారు. రమణిని మృతి తో సిబ్బంది, తోటి ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా విద్యాసంస్థల్లో భద్రతను పటిష్టం చేయాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఉంది.
తనని ప్రేమించలేదని క్లాస్ రూమ్ లోనే టీచర్‌ను పొడిచి చంపిన ప్రేమోన్మాది
తమిళనాడు – తంజావూరు జిల్లాలో రమణి మల్లిపట్టణంలోని ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది.
మదన్ అనే యువకుడు కొన్నాళ్లుగా ఆమెను ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. అందుకు ఆమె నిరాకరించింది.
దీంతో ఇవాళ క్లాస్… pic.twitter.com/sTdLGEa3Hy
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2024
తాజా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి .. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00
దీర్ఘచతురస్ర టేబుల్ లాంప్
పై లాంప్‌ను అమెజాన్ కొనుగోలు చేసేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/3AFhIo5
ఇవి కూడా చదవండి
Viral Video” ఒకరిని చూసి మరొకరు.. కిందవడి నవ్వులపాలు వీడియో వైరల్
Winter Cap” ఎంతటి చలిలోనైనా మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.. కేవలం 99 రూపాయలే..
Iqoo Phones” ఐక్యూ ఫోన్లపై భారీ తగ్గింపు.. అమెజాన్‌లో ఇప్పుడే కొనండి.. ఆన్‌లైన్‌లో
Karimnagar News” నిరుద్యోగ భృతితో పాటు ఏటా జాబ్ క్యాలెండర్ వచ్చేలా చూస్తా..
Viral Video” బైక్ ఏజెన్సీలోకి చొరబడిన ఎద్దు.. ఎర్ర షర్ట్ వేసుకున్న వ్యక్తిని పై.. వీడియో వైరల్
Pushpa-2 trailer” పుష్ఫ-2 ట్రయిలర్ లో లాంచ్‌లో ఉద్రిక్తత.. ప్రేక్షలపై లాఠీచార్జ్
20.11.2024 D.C Telugu morning news
Mysore Resort” చూస్తుండగానే.. స్విమ్మింగ్‌పూల్లో ముగ్గురు యువతుల మృతి
Tirunelveli Road Accident” రోడ్డు దాటుతూ బస్సు కింద పడి యువతి మృతి.. వీడియో
Electric Egg Boiler ఎగ్స్ ఉడకబెట్టేందుకు ఎగ్ బాయిలర్ కేవలం 369 రూపాయలే..
Pushpa-2 trailer” పుష్ఫ-2 ట్రయిలర్ లో లాంచ్‌లో ఉద్రిక్తత.. ప్రేక్షలపై లాఠీచార్జ్