Karimnagar news” బీసీలైన మల్కా కొమురయ్య ప్రసన్న హరికృష్ణ పూలే రవీందర్ ను గెలిపిద్దాం
తెలంగాణ విఠల
కరీంనగర్, ఫిబ్రవరి 24:
భౌగోళిక తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్నట్లు వెల్లడించిన సామాజిక వేత్త, ఉద్యమకారుడు తెలంగాణ విఠల్, సామాజిక తెలంగాణను బీసీలతోనే సాధించగలమని స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని ప్రెస్ భవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు డా. మహిపాల యాదవ్, బీసీ జేఏసీ జర్నలిస్ట్ సంఘం కన్వీనర్ కొత్త లక్ష్మణ్ పటేల్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతానికి పైగా ఉన్నప్పటికీ, రాజకీయంగా వారికి న్యాయం జరగడం లేదని విఠల్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ అభ్యర్థులను గెలిపించేందుకు పట్టభద్రులు తమ ఓటును అమ్ముకోకుండా, బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీల ఓట్లు బీసీలకే పోతే అన్ని పార్టీలు వారిని గుర్తించే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా లెక్కల్లో బీసీలను అవమానించిందని ఆరోపించారు.
స్వయం శక్తితో ఎదిగిన మల్కా కొమురయ్య విద్యాసంస్థల నెలకొల్పి ఎన్నో సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. టీచర్ ఎమ్మెల్సీ కి పోటీ చేస్తున్న మల్కా కొమురయ్యను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే ప్రసన్న హరికృష్ణ పూల రవీందర్ ను గెలిపించాలని అభ్యర్థించారు.
అగ్రవర్ణ అభ్యర్థులు దోపిడీకి వస్తున్నారు…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అగ్రవర్ణ అభ్యర్థులు విద్యావంతులను మోసం చేసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విఠల్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, మల్క కోమురయ్య, పూల రవీందర్ లాంటి బీసీ అభ్యర్థులను పట్టభద్రులు గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా డా. మహిపాల యాదవ్ మాట్లాడుతూ,19 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన నేను పట్టభద్రులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజీనామా చేసి బరిలోకి దిగాను అన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Gondi Damesa” మార్చి 1న కుర్లీలో గొండీ డేమ్సా పోటీలు.. హాజరవునున్న మహారాష్ట్ర, తెలంగాణ మంత్రులు
Amazon Offer” సాంసంగ్ నుంచి స్టన్నింగ్ ఫోన్.. 5జీ ఏఐ స్మార్ట్ ఫోన్..
IPhone 16 Offer” ఐఫోన్ 16… 9 శాతం తగ్గిపుతో.. అమెజాన్లో 72,400
realme P3 Pro 5G” రియల్ మీ పీ 3 ప్రో 5 జీ ఫ్లిప్కార్ట్లో 18 శాతం తగ్గింపుతో..
Harihara Veeramallu” సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడుస మీరు ప్రోమో వినండి..
