ఆర్మీ ఉద్యోగ ర్యాలీలో తొక్కిస‌లాట 37 మంది మృతి కాంగోలో ఘ‌ట‌న‌

ఆర్మీ ఉద్యోగ ర్యాలీలో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో 37 మంది మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ఆఫ్రికా దేశ‌మైన రిప‌బ్లిక్ ఆఫ్ కాంగోలో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. కాంగోలోని బ్ర‌జ్జావిల్లేలో వారం రోజుల నుంచి సైన్యంలో రిక్రూట్ మెంట్ జ‌రుగుతోంది. 1500 పోస్టులు ఉండ‌గా మిల‌ట‌రీ గ్రౌండ్లో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వ‌హిస్తున్నారు. ఈక్రమంలో రోజు వంద‌ల సంఖ్య‌లో వ‌స్తున్నారు. కానీ మంగ‌ళ‌వారం ఒక్క‌నాడే ఊహించిన‌దాకంటే ఎక్కువ వ‌చ్చారు. వారిని కంట్రోల్ చేయ‌డం అక్క‌డున్న నిర్వాహ‌కుల‌తో కాలేదు. వ‌చ్చిన యువ‌కులంతో లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో తొక్కిస‌లాట జరిగింది. ఈ ప్ర‌మాదంలో 37 మంది చనిపోయారు. ఇంకా కొంత మంది గాయ‌ప‌డ్డట్టు పీఎం కార్యాల‌యం ప్ర‌క‌టించింది.

ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి ఇద్ద‌రు మృతి

బ్యూటీ భామ‌ది నేడు బ‌ర్త్ డే… బీచ్ అందాల విందు

పెండ్లి భోజ‌నంలో ర‌స‌గుల్లాలు పెట్ట‌లేద‌ని క‌ర్ర‌ల‌తో కొట్లాట‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *