నామినేషన్ వేసిన ఎంపీ బండి సంజయ్
ధర్మ రక్షణ కోసం చివరి దాకా పోరాడుతానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సోమవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. మనోహర్‌రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్థి చీకోటి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట రాజాసింగ్ మాట్లాడారు. ధర్మం కోసం, ప్రజల పక్షాన ఉంటూ నిరంతరం పోరాటం చేస్తున్న బండి సంజయ్ పక్షాన ఉంటారా? అవినీతి, అక్రమాలతో వేల కోట్లు సంపాదించి ఓటుకు రూ.20 వేలు పంచేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ అభ్యర్ధి పక్షాన ఉంటారా? తేల్చుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. బండి సంజయ్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని అభివర్ణించారు. అంతటి శక్తితో దున్నపోతులు పోటీ పడలేవని సెటైర్లు వేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ అంతా కాషాయమయమైందని చెప్పారు. ఇంతమంది ఎందుకొచ్చారని, ధర్మం కోసమా..? కాదా అని ప్రశ్నించారు. లక్షా 20 వేల మంది ఓట్లు వేశారని, కాషాయ జెండాను ఏనాడు వదిలిపెట్టలేదని తెలిపారు. హిందూ సమాజాన్ని చులక చేయడంతో తనలో కసి పెరిగిందన్నారు. 80 శాతం ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చడం కోసమే 150 రోజులు పాదయాత్ర చేసినట్టు వివరించారు.
రజకార్ల పరిపాలన నుంచి ప్రజలను రక్షించేందుకు పోరాడుతున్నానని, నాపై మతతత్వ ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ వేస్తున్న సందర్భంగా తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం దేవాలయంలో పూజలు నిర్వహించారు.
కాంగ్రెస్ మూడో లిస్ట్… పాతవారిలో కొందరి మార్పు.. సీఎంపై పోటీ ఎవరంటే
పనిలోంచి తీసేసిందని.. పగ పెంచుకుని చంపేశాడు.