వ్యక్తిని తాళ్లతో బంధించిన వైన
మంచిర్యాల జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. తన పొలంలో పశువులు మేశాయని యజమానిని తాళ్లతో కట్టేశారు. జిల్లాలోని షెట్‌పల్లి గ్రామానికి చెందిన బాపు అనే వ్యక్తికి చెందిన ఎడు్ల అదే గ్రామానికి చెందిన రాంరెడ్డి అనే వ్యక్తి పొలంలో పడి మేశాయని అగ్రహించాడు. బాపును చెట్టుకు కట్టేసి హింసించాడు. స్థానికులు వచ్చి నచ్చజెప్పడంతో బాధితుడిని యజమాని వదిలేశాడు. బాధితుడు కోటపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
పశువులు మేశాయని దారుణం
